ELR: అవినీతి ఆరోపణల నేపథ్యంలో భీమడోలు పోలీస్ స్టేషన్ రైటర్ దొమ్మేటి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఠాణాకు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడినా, ప్రజలతో దురుసుగా ప్రవర్తించినా చర్యలు తప్పవన్నారు.