KNR: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్లో తిమ్మాపూర్ మండలం రాజాపూర్ గ్రామ సర్పంచ్ (స్వతంత్ర) కొంకటి రవితోపాటు వార్డు సభ్యులు గాజుల మహేందర్, కుక్కల రాజమ్మ, రెడ్డి భారతి, మాతంగి వేణు, తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.