KNR: చైల్డ్ మ్యారేజ్ నిరోధకత వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఆర్నకొండ జడ్పీ హై స్కూల్లో శుక్రవారం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో గంగాధర బ్లాక్ సీడీపీఓ నర్సింగరాణి మాట్లాడుతూ.. బాలిక వివాహ వ్యవస్థను నిర్మూలించాలని, గ్రామంలో ఎక్కడైనా ఇలాంటివి జరిగినట్లయితే 1098కు లేదా స్థానిక అంగన్వాడీ వర్కర్లకు, పాఠశాల హెచ్ఎంలకు తెలియజేయాలని కోరారు.