TG: పుస్తక ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న HYD బుక్ ఫెయిర్-2025 ప్రారంభం అయింది. మంత్రి జూపల్లి కృష్ణారావు HYD NTR స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. డిజిటల్, సోషల్ మీడియా ఎంత పెరిగినా పుస్తకాలు చదివే విధానాన్ని ఇప్పటికీ అనేకమంది కొనసాగిస్తున్నారని మంత్రి అన్నారు. ఆనాటి విలువలు.. ఆనాటి సంస్కారం.. ఆనాటి గుణగణాలు.. చాలా మంది కొనసాగిస్తున్నారని అభినందించారు.