అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 బోగీలు పట్టాలు తప్పాయి.. ఎనిమిది ఏనుగులు మృతిచెందాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, రైలు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.