ఖమ్మంలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్లో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది సైన్స్‌ఫేర్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. సైన్స్ ఎగ్జిబిషన్‌కు మొత్తం 743 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇన్స్‌స్పైర్ ఎగ్జిబిషన్‌కు 100 రిజిస్ట్రేషన్లు అందాయి.