తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రూ.3 కోట్ల బీమా డబ్బుల కోసం కన్నతండ్రిని కుమారులే పాముతో కాటు వేయించి చంపేశారు. ఆయనది సహజ మరణమని ఇన్సూరెన్స్ సంస్థ అధికారులను నమ్మించే క్రమంలో దొరికిపోయారు. ముందుగానే తండ్రి పేరిట బీమా చేయించి ఈ ఘాతకానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు.