మంచిర్యాల జిల్లాలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలతో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికలు ముగిసే సరికి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. సాధారణ రోజుల్లో నిత్యం రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. ఈ 11 రోజుల్లో రూ.35 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.