ATP: రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అనంతపురంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.