NRML: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం తెలిపారు. చిన్న చిన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలను లోక్ అదాలత్ ద్వారా త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.