WGL: మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల సౌకర్యార్థం సుమారు 4000 బస్సులను నడుపుతుందని కరీంనగర్ జోన్ ఈడి పి.సోలమన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని వెల్లడించారు. వరంగల్ రీజియన్లోని డిపో మేనేజర్లతో మేడారం-2026సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతర జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుందన్నారు.