KDP: ఈనెల 21న జరిగే పోలియో డేను విజయవంతం చేయాలని DMHO శోభరాణి, సిర్డ్స్ ప్రెసిడెంట్ ఎంవీ.సుబ్బారెడ్డి, మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ బచ్చల పుల్లయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రొద్దుటూరులో పోస్టర్లతో ర్యాలీ చేపట్టి, ఐదేళ్లలోపు పిల్లలందరికి పోలియో చుక్కలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ అంగన్వాడీలు, ఆశాలు పాల్గొన్నారు.