KRNL: దేవనకొండకు చెందిన వైద్య విద్యార్థి తపాల రవి తేజనాయుడు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష INI-SSలో ప్రతిభ చాటారు. డీఎం రుమాటాలజీ విభాగంలో 5వ ర్యాంకు సాధించి, రికార్డు సృష్టించారు. కడపలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం వారణాసిలో జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.