మెదక్: వ్యవసాయ శాఖ అధ్వర్యంలో శనివారం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ప్రారంభిస్తున్నారని జిల్లా వ్యవసాయశాఖ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. రైతులు యూరియా పొందాలంటే ప్లే స్టోర్ నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రైతులు ఈ యాప్లో తమ వివరాలను నమోదు చేసుకుని, యూరియా పొందాలన్నారు.