AP: మంత్రి లోకేష్ ఇవాళ మధ్యాహ్నం మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించనున్న ఆయన.. అనంతరం పార్టీ పదవుల భర్తీపై అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చర్చిస్తారు. అటు అనకాపల్లి పర్యటన అనంతరం CM చంద్రబాబు కూడా పార్టీ ఆఫీస్కు వెళ్లి టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకంపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.