KDP: పులివెందుల పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో శనివారం ఉదయం 2 ఆటోలు దగ్ధమయ్యాయి. కాలనీలో ఉన్న 2 ఆటోలను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టి దగ్ధం చేశారని బాధితులు వాపోతున్నారు. ఆటోలు దగ్ధం కావడంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలను దగ్ధం చేసిన వ్యక్తులను కనిపెట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.