మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శక నటుడు, రచయిత శ్రీనివాసన్(69) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆయన 220కుపైగా సినిమాల్లో నటించడంతో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించి అవార్డులు సొంతం చేసుకున్నాడు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.