NZB: అర్బన్ బీజేపీ సీనియర్ నాయకుడు బట్టిగిరి ఆనంద్ (45) కన్నుమూశారు. శనివారం వేగువ జామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన నగరంలోని 7వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నాయకుడి ఆకస్మిక మృతితో పార్టీలో విషాదఛాయలు నెలకొన్నాయి. NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అనుచరుడిగా ఉంటూ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.