NLG: నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక నకిరేకల్ లయన్స్ క్లబ్ వారు రోగులకు, వారితో వచ్చిన వారికి అల్పాహారం అందించారు. ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం అల్పాహారం అందించారు. గత కొన్ని రోజులుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం వేళల్లో అవసరాన్ని బట్టి వివిధ చోట్ల మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.