VSP: మధురవాడలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమిలి మండలం పెద్దవీధికి చెందిన పూసర్ల లక్ష్మణరావు (79) అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు వల్లినగర్లోని బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు జేఎన్ఎన్ఎయూఆర్ఎం కాలనీ జంక్షన్ సమీపంలో సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా వేగంగా వచ్చి వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.