VZM: రాజాం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావు ఇవాళ స్దానిక RTC కాంప్లెక్స్ ఆవరణలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌కు వచ్చిన వారితో మాట్లాడి ఆహారం నాణ్యత అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి ఆహారం అందేలా చూడాలని క్యాంటీన్ సిబ్బందికి సూచించారు.