NLR: కందుకూరు రూరల్ పరిధిలోని మాచవరం గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, అతనికి రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై రేవతి, సిబ్బంది పాల్గొన్నారు.