HNK: ఐనవోలు మండలంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మల్లన్న పట్నం, తలనీలాలు సేవలకు టోకెన్ ఫీజులతోపాటు రూ.100 నుంచి రూ.1000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగిన వేళ ఈ దోపిడీ మరింత ఎక్కువైందని విమర్శలు ఉన్నాయి.