అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీశాడు.