హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘తెలుగు సినిమాలు చేయకపోవడంతో తెలుగు సినిమాలను, తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నా. తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తాను. నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే. ఒక చక్కటి కథ కోసం ఎదురు చూస్తున్నా. ఇటీవల విడుదలైన అఖండ తాండవం మూవీ విజయానికి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కొంది.