విద్యార్థి నాయకుడు షరీఫ్ మృతితో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు కొంతకాలంగా బంగాళాఖాతంలో ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భారత్‌ను కావాలనే రెచ్చగొడుతోందని తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన చేపల బోట్లు తరచూ భారత ప్రాదేశిక జలాల్లోకి రావడం, బంగ్లా నేవీ ఈ ప్రాంతంలో గస్తీ పెంచడం దీనికి బలం చేకూరుస్తోంది.