‘కొత్తలోక: చాప్టర్1’ మూవీపై హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నన్ను సూపర్ హీరో పాత్రలో ప్రేక్షకులు అంగీకరిస్తారో, లేదోనని భయపడ్డాను. రివ్యూలు వచ్చే వరకూ భయంతో గదిలో నుంచి బయటకు రాలేదు. నేను కాదు.. మా టీమ్ మొత్తం అలానే టెన్షన్ పడ్డాం. ఎంత భయపడ్డామో అంత పాజిటివ్ స్పందన వచ్చింది. రివ్యూలు చదవగానే మా ఆందోళన మొత్తం మాయమైంది. అప్పుడు బయటకి వచ్చాం’ అని చెప్పుకొచ్చింది.