AP: విశాఖలోని సింహాచలం-వేపగుంటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.