VZM: డెంకాడ సమీపంలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వృద్ధురాలుని బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆమెను వెంటనే ఆటోలో డెంకాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించినట్లు ఎస్సై సన్యాసి నాయుడు తెలిపారు. వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఆమె వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.