డ్యూటీ ముగించుకుని హాస్టల్కు తిరిగి వెళ్తున్న వైద్యురాలి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. షాక్ అయిన ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఘటనపై ఆ వైద్యురాలు సోలదేవనహళ్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.