దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీశాడు. మొత్తం సిరీస్లో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ప్రస్తుతం అతడు ICC ర్యాంకింగ్స్లో వరల్డ్ నం.1 బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 33 టీ20ల్లో అతడు 55 వికెట్లు పడగొట్టాడు.