బిగ్ బాష్ లీగ్లో బ్రిస్బేన్ హీట్ సంచలనం సృష్టించింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ జట్టు పెర్త్ స్క్రాచర్స్పై ఘన విజయం సాధించింది. దీంతో ఈ లీగ్లో అత్యధిక టార్గెట్ను ఛేజ్ చేసిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఓవరాల్ టీ20ల్లో 3వ స్థానంలో నిలిచింది. IPLలో KKR ఇచ్చిన 262 పరుగుల లక్ష్యాన్ని PBKS ఛేదించి టాప్లో నిలిచింది.