BDK: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ బూర్గంపాడు(M) పాండవుల బస్తీలో ఉపాధి హామీ కార్మికులు నిరసన చేపట్టారు. ‘జి-రామ్- జీ’ పత్రాన్ని తగలబెట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం కార్మికుల హక్కు అని, దానిని బలహీనపరిచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు.