KNR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏ ఒక్క విద్యార్థి దంత సమస్యలతో బాధపడకుండా చూడాలని వైద్యాధికారులను శుక్రవారంజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి విద్యార్థులందరికీ దంత వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనితీరును పరిశీలించారు.