MDCL: బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్లో 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నెం. 186,191తో పాటు 334లలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని, కాపాడాలని బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలసిన తాత్కాలిక షెడ్డులను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.