VKB: ఆర్థిక నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీఎల్ఎఫ్ కౌన్సిలర్ సురేష్ సూచించారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ఆర్థిక నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో జరుగుతున్న వివిధ రకాల ఆర్థిక మోసాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.