ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు ఆదివారం మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.