నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, నాని ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ సర్ప్రైజ్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘సంపూర్ణేష్ బాబు ఇకపై ఫన్నీ కాదు.. ‘బిర్యానీ’గా జడల్ స్నేహితుడిగా కనిపించనున్నాడు’ అని శ్రీకాంత్ ఓదేల పోస్టర్ రిలీజ్ చేశాడు.