WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ జోన్ DCP కవిత కోరారు. రాజీపడదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలను ఈ మెగా అదాలత్ ద్వారా త్వరగా కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీమార్గమే రాజా మార్గమని ఆమె కక్షిదారులకు సూచించారు.