KMR: అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్ట నివారణ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణా రావు సూచించారు. శుక్రవారం ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.