KMR: ఎన్నడూ లేనివిధంగా పల్లెల్లో బీజేపీ పాగా వేసిందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బీబీ పాటిల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్‌లుగా ఎన్నికైన బీజేపీ మద్దతుదారులను ఘనంగా సన్మానించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చి స్థానాలను గెల్చుకుందన్నారు.