KRNL: 104 వాహన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇవాళ మంత్రాలయం 104 ఉద్యోగులు వెంకటేశ్వర్లు, కొండయ్య, రామయ్య డిమాండ్ చేశారు. అరబిందో సంస్థ చెల్లించిన చివరి నెల వేతనాలను ప్రతీ ఉద్యోగికి కొనసాగించాలన్నారు. తగ్గించిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని, వాహనాలను నెలలో ఒకసారి సర్వీస్ చేయించి కండిషన్ ఉండేలా చూడాలని తెలిపారు.