KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలో పర్యటించిన ఆయన టవర్ సర్కిల్ బీటీ రోడ్డు, పైపులైన్ మరమ్మతులు, ఐడీఎస్ఎంటీ భవన ఆధునీకరణ పనులను పరిశీలించారు. జనవరి 1లోగా భవన పనులు పూర్తి చేయాలని, పైపులైన్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.