BHPL: కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు దేవాలయానికి ములుగు వెంకటాపూర్‌కు చెందిన తౌటు రెడ్డి స్వర్ణలత-భాస్కర్ రెడ్డి దంపతులు రూ.16 వేలతో 11 కిలోల గంటను సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.