BHPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. మూడేళ్ల క్రితం నిర్మించిన 100 పడకల ఆసుపత్రి బేస్మెంట్ పగుళ్లు పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పేదలకు వైద్య సేవలు అందించే ఈ 3 అంతస్తుల భవనంలో నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లోపాలపై దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేశారు.