CTR: పల్స్ పోలియోలో 100% లక్ష్యాలను సాధించాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సూచించారు. బంగారుపాళ్యం ఎంపీడీవో కార్యాలయంలో పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను ఇవాళ ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు వెల్లడించారు. లక్ష్యాలను చేరుకునేందుకు ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు.