MLG: వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో నాలుగు కాళ్లతో ఉన్న కోడి పిల్ల కనువిందు చేసింది. అదే కోడి పెట్టిన గుడ్ల నుంచి పుట్టిన మిగతా కోడి పిల్లలు సాధారణంగానే ఉండగా, ఒక్క పిల్ల మాత్రం 4 కాళ్లతో కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యా రు. పలువురు తమ ఫోన్లలో ఈ దృశ్యాన్ని బంధించారు.