AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,665 మందికి పరీక్షలు చేయగా 1,884 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతోపాటు ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇప్పటివరకు 17 మంది మరణించారు.