హెలెన్ కెల్లర్ 1880లో అమెరికాలో జన్మించారు. ఆమె చిన్న వయసులో వైరల్ ఫీవర్ బారినపడి కంటి చూపు, వినికిడి, మాట కోల్పోయారు. అయితే, ఆమె గురువు ఆన్ సలివన్.. చేతి సంకేతాల ద్వారా అక్షరాలు నేర్పించారు. చదువులో అసాధారణ ప్రతిభ చూపించిన ఆమె ప్రపంచంలో తొలి దృష్టి-వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా డిగ్రీ సాధించారు. దివ్యాంగులు, మహిళల హక్కులు, సామాజిక న్యాయం కోసం హెలెన్ అలుపెరగని పోరాటం చేశారు.