HNK: హసన్పర్తి మండలం ముచర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై వరుసగా మూడు విద్యుత్ స్తంభాలు ఒకే వైపు వంగి కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అవాంఛనీయ ఘటన జరగకముందే స్తంభాలను సరిచేయాలని అధికారులను స్థానికులు కోరారు.